Saturday, October 18, 2014

నేను తప్పు చేసాను

నేను ఎస్ఎస్సి వార్షిక పరీక్షలువ్రాస్తున్న రోజులవి,సందేహం లేదు నాకు తెలుసు మా గవర్నమెంట్  స్కూల్ టాపర్ ని నేనే నని,అపుడే జమ్బ్లింగ్ పద్దతి స్టార్ట్ అయ్యింది,నా వెనకే మా స్కూల్ స్టూడెంట్,తనకి రెండు కాళ్ళు  లేవు,ట్రైసైకిల్ పైన వచ్చేవాడు,హాస్టల్ లో ఉండేవాడు,నాకు తెల్సు, తను చదవలేడని,నా మీద నమ్మకం పెట్టుకున్నాడని మాత్రం ఆలోచించలేదు,నాకు స్వార్ధం ఎక్కువ, స్కూల్ ఎగ్జామ్స్ లో కూడా ఎవరికీ చూపించే వాణ్ణి కాదు,నా ప్రక్కనే ప్రైవేటు స్కూల్ స్టూడెంట్,కాని వీడితో  ఆన్సర్స్ షేర్ చేసుకున్నాను,కనీసం ఆబ్జెక్టివ్ టైపు కూడా మా స్కూల్ మేట్ కి చూపించలేదు అనుకుంటున్నాను,ఫలితం నేను స్కూల్ టాపర్,తను ఫెయిల్,తర్వాత తన గురించి ఆలోచించలేదు,కానినేను జాబు తెచుకొన్నకొన్ని రోజుల తర్వాత గిల్టీ ఫీల్ అయ్యాను,నేను కొంచెం సహాయం చేసినా తను పాస్ అయి ఉండేవాడేమో?ఏమో తను పాస్ అయ్యి ఉంటే తనకి జాబు వచ్చేది (కనీసం పిహెచ్ సి కోటా లో నైనా),తన కుటుంబం కూడా బాగుండేది కదా?కనీసం తను ఇంటర్ అయిన చదివే వాడు కదా?నేను పెద్ద స్టుపిడ్ ని శ్రీనివాస్ పెద్ది?సహాయం చేసే గుణం నాకు లేనందుకే ఇలా జరిగింది.నీ గురించి తెలుసు కుందామనుకున్న భయమేస్తోంది.

ఇక్కడ సహాయం చెయ్యడం అంటే నేను రాసింది చూపించడం,కాపీ చెయ్యడం తప్పు అనుకుంటే నేను ప్రైవేటు స్కూల్ స్టూడెంట్ తో షేర్ చేసుకోవడం కు తప్పే?ఒకవేళ అది తప్పు అనుకుంటే పరీక్ష   రోజుల్లో ముఖ్యమైన ప్రశ్నలు చెప్పి చదివించినా అదికూడా సహాయమే ,మరి అది కూడా చెయ్యలేదు,అయిన నేను కాపీ కొట్టినట్టే,తప్పు చేసినట్టే,మరెందుకు సహాయం చెయ్యలేదు,ఎందుకంటే తనతో నాకు వచ్చే ఉపయోగం ఏమిలేదు కదా? చీ ఇది నా చదువు,ఇతరులకి సహాయం చెయ్యాలని తెలియని చదువు ఒక చదువేనా?,కాని ఆ చదువు వల్ల వచ్చిన జ్ఞానమే నాకు ఇప్పుడు జ్ఞానం కలిగించింది,పిల్లలకి విలువలతో కూడిన విద్య ఖచ్చితంగా అవసరం అని........

0 comments:

Post a Comment