This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Sunday, November 16, 2014

మీ పిల్లవాడికి సార్ అంటే....భయం ఉందా ? భక్తి ఉందా?


ఒక చిన్న పిల్లవాడు ,తన టెడ్డి బేర్ తో ఆడుకుంటున్నాడు,ఆ ఆటలో భాగంగా టెడ్డి బేర్  ను పట్టుకొని చెప్పు చదువుకుంటావా లేదా? స్కూల్ కి రాను అంటావా?అల్లరి చేస్తావా ? అని కొడుతున్నాడు...
   ఒక్క సారి ఆలోచించండి....


ఆ బాబు టెడ్డి బేర్ ను ఎందుకు కొడుతున్నాడో...

ఎందుకంటే తను ఒక మాస్టారు ఇప్పుడు ,తన ఆటలోని స్కూల్ లో విద్యార్థి చదువుకోక పోతే ఇలా కొట్టాలి అని కొడుతున్నాడు...
 ఈ కొట్టడం ఎక్కడ చూసాడు... పిల్లవాడు!
ఈ పిల్లవాడికి సార్ అంటే....భయం ఉందా ? భక్తి ఉందా?  

Tuesday, November 11, 2014

తల్లి, తండ్రి, గురువుల్లరా! ఇది చదవండి,

గురువులారా!

నువ్వు దేవుడివి కావు

పిల్లల దగ్గర నువ్వు దేవుడిలా నటిస్తావెందుకు?

నువ్వు అన్ని తెలిసిన వాడివి కావు

పిల్లల అజ్ఞానం చూసి నవ్వుతావెందుకు?

నువ్వు సర్వ శక్తిమంతుడివి కావు

పిల్లల నిస్సహాయత చూసి విసుక్కుంటావు ఎందుకు?

నువ్వు సంపూర్ణ మానవుడవు కావు

పిల్లల తప్పులు చూసి నువ్వెందుకు కోపం తెచ్చుకుంటావు?

ముందు నీ వైపు చూసుకో

ఆ తర్వాత పిల్లల వంక చూడు!


                                       -గిజుబాయి



Wednesday, October 29, 2014

పిల్లల్ని ఉత్సహపరిస్తే అద్భుతాలు చేస్తారని నాకు ఇంతకంటే సాక్ష్యం ఎం కావాలి?

అసలు నాకు చదువు వచ్చో రాదో తెలియని రోజుల్లో
నేను 7వ తరగతి లో ఉన్నపుడు ,మాకు తెలుగు పండితురాలు ఉండేది,
నాలో ఉన్నచదివే వాడిని నేను నమ్మేల చేసింది ఎలాగో తెల్సా?
మా స్కూల్ లో ఎవరు అప్పటి వరకు పెట్టని స్లిప్ టెస్ట్ పెట్టింది...!
గెలిచిన్దేవరో మీకు తెల్సే ఉంటుంది..
ఇంకెవరు నేనే..!
ఆ రోజు ఒక నోట్ బుక్ (డబ్బులు మా పిల్లలందరి నుండి కలెక్ట్ చేసిన్దనుకోండి)
ప్రైజ్ నాకు,
తర్వాత త్రైమాషిక పరీక్షలో నాకు స్టీల్ గ్లాస్  ప్రైజ్...!
ఇలాగ పరంపర కొనసాగింది..!
చివరకు స్కూల్ టాపర్ ని నేనే!
తను నన్ను కొంచెం మాత్రమే గుర్తించింది ఇంకా నన్ను గుర్తిస్తే చాల బాగుండేది అని
ఎప్పుడు అనుకుంటాను
 పిల్లల్ని ఉత్సహపరిస్తే అద్భుతాలు చేస్తారని నాకు ఇంతకంటే సాక్ష్యం ఎం కావాలి?

Saturday, October 18, 2014

పసి మనుసు

చిన్న పిల్లల ఆలోచనలు అపరిమితం,సరి గా సాన పెడితే వజ్రాలు బయటికొస్తాయి,సాదారణంగా మనం అనుకొంటూ ఉంటాం,పిల్లలకి బోత్తిగా ఏకాగ్రత ఉండదు అని,కాని అబద్దం,చిన్న పిల్లవాడు బస్సు ఎక్కినా తర్వాత చాలా అందమైన అనుభవాలతో బయటకి వస్తాడు,తనే బస్సు కండక్టర్ అయినట్టు,తనే బస్సు డ్రైవర్ అయినట్టు,బస్సు ప్రయాణం మొత్తం పిల్లవాడు ఏకాగ్రత తో గమనిస్తాడు ,బస్సు డ్రైవర్ చేసే ప్రతి పనిని,కండక్టర్ చేసే ప్రతి పనిని,,,,
మరెందుకు బడిలో పాసివ్ గా ఉన్నాడు అంటే,,,తన మనస్సు చదువుకొనే అంశాల పై ఎందుకు  మరలడం లేదు..?
మరలాల్చిన భాద్యత ఖచ్చితంగా ఉపాధ్యాయుడిదే....

నేను తప్పు చేసాను

నేను ఎస్ఎస్సి వార్షిక పరీక్షలువ్రాస్తున్న రోజులవి,సందేహం లేదు నాకు తెలుసు మా గవర్నమెంట్  స్కూల్ టాపర్ ని నేనే నని,అపుడే జమ్బ్లింగ్ పద్దతి స్టార్ట్ అయ్యింది,నా వెనకే మా స్కూల్ స్టూడెంట్,తనకి రెండు కాళ్ళు  లేవు,ట్రైసైకిల్ పైన వచ్చేవాడు,హాస్టల్ లో ఉండేవాడు,నాకు తెల్సు, తను చదవలేడని,నా మీద నమ్మకం పెట్టుకున్నాడని మాత్రం ఆలోచించలేదు,నాకు స్వార్ధం ఎక్కువ, స్కూల్ ఎగ్జామ్స్ లో కూడా ఎవరికీ చూపించే వాణ్ణి కాదు,నా ప్రక్కనే ప్రైవేటు స్కూల్ స్టూడెంట్,కాని వీడితో  ఆన్సర్స్ షేర్ చేసుకున్నాను,కనీసం ఆబ్జెక్టివ్ టైపు కూడా మా స్కూల్ మేట్ కి చూపించలేదు అనుకుంటున్నాను,ఫలితం నేను స్కూల్ టాపర్,తను ఫెయిల్,తర్వాత తన గురించి ఆలోచించలేదు,కానినేను జాబు తెచుకొన్నకొన్ని రోజుల తర్వాత గిల్టీ ఫీల్ అయ్యాను,నేను కొంచెం సహాయం చేసినా తను పాస్ అయి ఉండేవాడేమో?ఏమో తను పాస్ అయ్యి ఉంటే తనకి జాబు వచ్చేది (కనీసం పిహెచ్ సి కోటా లో నైనా),తన కుటుంబం కూడా బాగుండేది కదా?కనీసం తను ఇంటర్ అయిన చదివే వాడు కదా?నేను పెద్ద స్టుపిడ్ ని శ్రీనివాస్ పెద్ది?సహాయం చేసే గుణం నాకు లేనందుకే ఇలా జరిగింది.నీ గురించి తెలుసు కుందామనుకున్న భయమేస్తోంది.

ఇక్కడ సహాయం చెయ్యడం అంటే నేను రాసింది చూపించడం,కాపీ చెయ్యడం తప్పు అనుకుంటే నేను ప్రైవేటు స్కూల్ స్టూడెంట్ తో షేర్ చేసుకోవడం కు తప్పే?ఒకవేళ అది తప్పు అనుకుంటే పరీక్ష   రోజుల్లో ముఖ్యమైన ప్రశ్నలు చెప్పి చదివించినా అదికూడా సహాయమే ,మరి అది కూడా చెయ్యలేదు,అయిన నేను కాపీ కొట్టినట్టే,తప్పు చేసినట్టే,మరెందుకు సహాయం చెయ్యలేదు,ఎందుకంటే తనతో నాకు వచ్చే ఉపయోగం ఏమిలేదు కదా? చీ ఇది నా చదువు,ఇతరులకి సహాయం చెయ్యాలని తెలియని చదువు ఒక చదువేనా?,కాని ఆ చదువు వల్ల వచ్చిన జ్ఞానమే నాకు ఇప్పుడు జ్ఞానం కలిగించింది,పిల్లలకి విలువలతో కూడిన విద్య ఖచ్చితంగా అవసరం అని........

Thursday, October 16, 2014

పిల్లవాడిని తనపని తననే చేసుకోనివ్వాలి

పిల్లవాడిని తనపని తననే చేసుకోనివ్వాలి,అని గిజుబాయి గారు చెప్పింది అక్షరాలా నిజం

ఒక పిల్ల వాడు ఆడుకుంటూ ఉన్నాడనుకో ,తనే బొమ్మలు ఏరుకోవాలి అనుకుంటాడు,తనకు మనం సహాయం చేసామనుకో తను వెంటనే ఆ ఆట  ఆపేస్తాడు,ఆహా ఎంత అద్భుతమైన విషయం,పిల్లవాడు తను ఎవరిపైనా ఆధారపడుకుండా ఉండాలి అనుకుంటాడు,మనమేం చేస్తాము, తనకి సహాయం చేస్తూ మన పైన ఆధార పడేట్లు చేస్తాము,అలాగ సోమరి ని మనమే తయారు చేస్తాము,తర్వాత మనమే సోమరి అని తిడతాము,దానికి మనమే బాధ్యులము కాదంటారా?

Monday, October 13, 2014

చిన్ని మనసు

నాకు లెక్కలంటే అసలే భయం..

లెక్కల సారు అంటే ఇంకా భయం

జమ తీసివేత అంటూ ఎదో ఎదో చెప్తాడు

కాని లెక్కల బుక్కు లో నాకు కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి

భిన్నాలు అంటే ఇష్టం ఎందుకంటే రంగులు వెయ్యొచ్చు ,కలర్ పెన్సిల్స్ కోనోచ్చు

ఆ రోజు లెక్కల సారూ చెప్పబోయేది భిన్నాలే,

(గాల్లో తెలినట్లుందే అనే పాట పడుకున్ననేమో)

కాని క్లాసు లో ఆ రోజు దెబ్బలు తిన్నాను ...

ఎందుకు కొట్టావు సారూ నన్ను....